ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'పల్నాడులో ఇఫ్తార్‌ విందుకు టీడీపీ నేతలను పిలుస్తావా' అంటూ వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి - YCP Leader Attack - YCP LEADER ATTACK

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 1:29 PM IST

YCP Leaders Attack TDP people Palnadu District : పల్నాడు జిల్లాలో అధికార నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. రెంటచింతల మండలం తుమ్మకోటలో ఈ నెల 5న టీడీపీ కార్యకర్త జలీల్ ఖాన్ ఇఫ్తార్​ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డిని ఆహ్వానించారు. ఇఫ్తార్​ విందు అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు

తమ గ్రామంలోకి టీడీపీ నేతలను పిలుస్తావా? అంటూ జలీల్​ ఖాన్​ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇఫ్తార్​ విందు ఇస్తావా అంటూ ఆరుగురు వైసీపీ నాయకులు జలీల్​ ఖాన్, ఆయన స్నేహితుడు చాంద్​ బాషాపై రాళ్ల, కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తమకి ప్రాణహాని పొంచి ఉందని పేర్కొన్నారు. దాడిలో గాయపడిన కార్యకర్తలను కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డిని పరామర్శించారు

ABOUT THE AUTHOR

...view details