వాలంటీర్లకు వైఎస్సార్సీపీ నేతల వాయిస్ మెసేజ్- బాలశౌరి మీటింగ్‌కు వెళ్లిన వారి వివరాలు నోట్ చేయాలని ఆదేశం - YCP Leader Voice Message Volunteers - YCP LEADER VOICE MESSAGE VOLUNTEERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 12:47 PM IST
YCP Leader Voice Message in Volunteers Whatsapp Group: అధికారం ఉందనే అండతో వైఎస్సార్సీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఓ వైసీపీ నేత ప్రతిపక్ష నేత మీటింగ్‌కు వెళ్లే వారిని గుర్తు పెట్టుకోవాలని వాలంటీర్లకు చెబుతున్నారు. జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balasouri) కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాలశౌరి మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామ చేసిన వాలంటీర్లకు వైఎస్సార్సీపీ నేత ఆదేశాలు జారీ చేశారు.
Janasena Leader Balasouri election Campaign: బాలశౌరి మీటింగ్‌కు వెళ్లిన వారి వివరాలు తమకు ఇవ్వాలని 3వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ (Deputy Mayar) భారతీ భర్త శీలం బాబ్జీ వాలంటీర్లకు వాయిస్ మెసేజ్లు (voice Message in Volunteers) పంపారు. వాలంటీర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి గంగులతోటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రావాలని వాలంటీర్ల గ్రూప్లో శీలం బాబ్జీ వాయిస్ మెసేజ్ పంపించారు.