ఉద్యోగం పేరుతో వైసీపీ నాయకుడు మోసం- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు - YCP Leader Fraud - YCP LEADER FRAUD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 12:51 PM IST
YCP Leader Fraud High Court job in Krishna District : ఉద్యోగం ఇప్పిస్తామని వైసీపీ నాయకుడు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో జరిగింది. హైకోర్టులో ఉద్యోగం ఉందని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు వెంపటి సైమన్ తమ వద్ద రూ. 3.50 లక్షలు కాజేశాడని బాధితుడు నాగబాబు ఆరోపించారు. సైమన్‌పై నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Gudivada in Krishna District : తమ డబ్బులు తిరిగి ఇవ్వమని సైమన్ను అడిగితే బెదిరిస్తున్నారని బాధితుడు నాగబాబు వాపోతున్నారు. వైసీపీ నేతలు ఓ ముఠాగా ఏర్పడి ఉద్యోగాల పేరుతో అనేక మందిని మోసం చేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ గుడివాడ పోలీసు స్టేషన్ వద్ద కుమారుడితో కలిసి నాగబాబు పడిగాపులు కాస్తున్నారు. తమకు న్యాయం జరిగే విధంగా సైమన్‌పై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.