ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు : మంత్రి ధర్మాన ప్రసాదరావు - YCP Leader Dharmana Prasada Rao

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 10:48 AM IST

YCP Leader Dharmana Prasad Rao Election Campaign in Srikakulam District : వాలంటీర్లు ఇక నుంచి అధికార పార్టీ నాయకులే అంటూ వైసీపీ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలస సమీపంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వాలంటీర్లు, వైసీపీ బూత్ ఏజెంట్లుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఎన్నికల కార్యాచరణపై దిశానిర్ధేశం చేశారు.

Ampolu Panchayat Srikakulam District : రాజీనామా పత్రాలు అందజేసిన వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా ఉంటారని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఈ నెల రోజులు ప్రజలకు నచ్చజెప్పి ఓట్లు తేవాలని ఈ సందర్భంగా ఆయన సృష్టం చేశారు. వాలంటీర్ల అందరూ వైసీపీ అభిమానం కుటుంబాల నుంచే వచ్చారని తెలిపారు. వాలంటీర్లు అందరూ పార్టీ ఆశయాలను నమ్మి వచ్చిన వారే అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మళ్లీ వాలంటీర్లను నియమిస్తామని హామీ ఇచ్చారు. అంత వరకు పార్టీ కార్యకర్తలుగా ఎన్నికల ప్రచారంలో కొనసాగాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details