'పాత్రికేయుడిపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు'- 'తల్లీ, కొడుకుపై దాడి చేసి గొలుసు అపహరణ' - YCP attack on journalist
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 7:07 PM IST
YCP Activists Attacked Journalist And Two Persons: ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు మూక దాడులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈనాడు పాత్రికేయుడు రమేశ్‌పై వైసీపీ మూకలు దాడి చేశాయి. కళ్యాణదుర్గంలో జగన్ రోడ్ షో ఫొటోలు తీస్తున్న రమేశ్‌ను వైఎస్సార్సీపీ రౌడీలు అడ్డుకున్నారు. అనంతరం అతని ఫోన్‌ను లాక్కున్నారు. ప్రతిఘటించిన రమేశ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. రమేశ్ ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. గాయపడిన రమేశ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పాత్రికేయుడు రమేశ్‌ను కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పరామర్శించారు.
ఇదే విధంగా సీఎం జగన్ రోడ్ షోలో ఓ తల్లి, కుమారుడిపై మరోసారి రెచ్చిపోయి వైసీపీ మూకలు దాడి చేశాయి. సీఎం రోడ్ షోకు కారును అడ్డుగా పెట్టారంటూ వారి ఇద్దరిపై దాడి చేశారు. మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుని వైసీపీ మూకలు ద్విచక్రవాహనాలపై పరారయ్యారు. వైసీపీ మూకలు రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ ప్రజలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ ఘటనలను చూసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు.