ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కొత్తూరులో రెచ్చిపోయిన వైఎస్సార్​సీపీ మూకలు - మహిళలపై విచక్షణారహితంగా దాడి - YCP Activists Attack TDP Families - YCP ACTIVISTS ATTACK TDP FAMILIES

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 4:27 PM IST

YCP Activists Attack on TDP Families And Injured Womens: పోలింగ్​ ముగిసినా వైఎస్సార్​సీపీ నేతల ఆగడాలు మాత్రం తగ్గడంలేదు. మహిళలను కూడా చూడకుండా అతికిరాతకంగా దాడికి పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొత్తూరులో వైఎస్సార్​సీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశానికి చెందిన పలు కుటుంబాలపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్​సీపీ మూక దాడిలో అనసూయమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అనసూయమ్మ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినా కసి తీరని వైఎస్సార్​సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలోకి చొరబడ్డారు. 

క్షతగాత్రులు అనసూయమ్మతోపాటు ఆమె బంధువులు జ్యోతి, ఈశ్వరమ్మ, చిట్టెమ్మ,శకుంతల, లలితమ్మలపైకి తెగబడ్డారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్ది చితకబాదారు. దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన నరసింహను కూడా కొట్టారు. అనసూయమ్మను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్​ చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details