ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దాడి చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: యరపతినేని శ్రీనివాసరావు - Srinivasa Rao Angry YCP leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 5:56 PM IST

Yarapatineni Srinivasa Rao Angry on YCP Leaders About Attack: టీడీపీ నాయకులపై దాడి చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు టీడీపీ నాయకులను యరపతినేని పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలను ఊరు విడిచి బయటకు పంపించారని నాయకులు వాపోయారు. 

కొందరు టీడీపీ నాయకులు బయట గ్రామాల్లో తలదాచుకుంటుంటే వారిపై వైసీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు తమపై దాడి చేశారని పోలీస్​ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడిన శ్రేణులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details