ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వీధి దీపాలూ వేయని మీకెందుకు రాజకీయాలు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళలు - Chinamachanur women stop mla

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 12:08 PM IST

Women_Stopped_YSRCP_Mla_Campaign_In_Marripaadu

Women Stopped YSRCP MLA Mekapati Campaign in Marripaadu: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డికి (YSRCP MLA Mekapati vikram Reddy) తన సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చినమాచనూరులో కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న ప్రచారా కార్యక్రమాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి గ్రామాలలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. సమాధానం చెప్పి ఇక్కడి నుంచి కదలాలి అంటూ ప్రచార వాహనాన్ని మహిళలు అడ్డుకున్నారు.  

సాగు, తాగు నీరు లేక తాము అల్లాడుతుంటే ప్రజాప్రతినిధిగా ఏం చేశారని మండిపడ్డారు. వీధి దీపాలు (street Lights) కూడా వేయలేని మీకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. దీంతో స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నారు. ప్రచారాలకు ఖర్చు చేయడానికి కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ప్రజలకు ఖర్చు పెట్టడానికి లేవా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details