ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెల్లవారుజామున పిల్లల్ని వదిలేసి- మైలేపల్లిలో మహిళల సమరం - Drinking Water Problem in Mylepalli - DRINKING WATER PROBLEM IN MYLEPALLI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 12:18 PM IST

Women Protest Solving the Water Problem in Mylepalli: శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలేపల్లిలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. సుమారు ఎనిమిది నెలలుగా గ్రామంలో నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి పైపులైన్లు మరమ్మతులు చేయించి నీటి సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కావడంతో నీటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. జిల్లా అధికారులు ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచిస్తున్నా వాళ్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.

గ్రామంలో పైపులైన్లు మరమ్మత్తుల కారణంగా నీళ్లు రాక 8 నెలలు అవుతుంది. అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడమే లేదు. తెల్లవారు జామున 3 గంటలకు చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు నీటి సమస్య గురించి అధికారులకు చెప్పినా తగిన చర్యలు తీసుకోలేదు. దయచేసి ఇప్పటికైనా నీటి సమస్యపై దృష్టి సారించాలని అధికారులను కోరుతున్నాం. - గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details