నాసిరకంగా విశ్వవిద్యాలయ భవనం - చిన్నపాటి వర్షానికే లీకేజీలు - Rain water in University - RAIN WATER IN UNIVERSITY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 4:40 PM IST
Water Leakage in Rayalaseema University at kurnool : కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో 2021లో నిర్మించిన నూతన భవనం పనులు నాసిరకంగా పూర్తి చేశారు. ఫలితంగా చిన్న పాటి వర్షానికే లీకేజీలు ఏర్పడుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన నాలుగు అంతస్థుల భవనంలోకి వర్షపు నీరు వస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తైనా అధికారికంగా ప్రారంభానికి నోచుకోలేదని విద్యార్థులు తెలిపారు. భవనం వెలుపల అలంకరణ కోసం అమర్చిన నలుపు బండలు ఊడి కింద పడిపోతున్నాయని విద్యార్థులు తెలిపారు.
గత మూడు సంవత్సరాలుగా మొదటి అంతస్థులో లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. వెలుపల నుంచి చూసేందుకు భవనం అందంగా కనిపిస్తున్నా లోపల చిన్నపాటి వర్షానికే గోడలు నుంచి నీరు కావడంతో అవస్థలు పడుతున్నామని విద్యార్థులు చెప్పారు. భవనం లోపల వర్షపు నీరు చూస్తుంటే చిన్నపాటి చెరువుల్లాగ ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాసిరకంగా భవనం నిర్మించిన గుత్తేదారుపై, సహకరించిన ఆర్ అండ్ బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.