ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఇచ్చట ఓట్లు అమ్మబడవు'- ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకోవాలి' - Votes are not sold here - VOTES ARE NOT SOLD HERE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 1:33 PM IST

Vote Campaign in an Innovative Way in Anantapur District : అనంతపురం జిల్లా గుంతకల్లులో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ తన నివాసానికి స్టికర్ అతికించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. రాజ్యంగబద్ధంగా నిర్వహించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. 

ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు రాజకీయ నాయకులు ఇచ్చే తాయిలాలు వరాలు అన్నీ ఇన్నిీ కావు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అయినా ఏం చేసి అయినా ఓటర్లను ప్రలోభ పెట్టి అధికారం దక్కించుకోవాలని రాజకీయ పక్షాలు కోట్ల రూపాయలు కుమ్మరించేస్తుంటాయి. మద్యం సీసా, బిర్యానీ ప్యాకెట్లు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఈ కొన్ని రోజులు పబ్బం గడుపుకునే వారు కొందరైతే, ప్రజలను చైతన్య పరుస్తూ ఆలోచింపజేయాలని యత్నించేవారు మరికొందరు. 

ABOUT THE AUTHOR

...view details