ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు- ఈసీ ఆదేశాలను లెక్కచేయని వైఎస్సార్సీపీ - వాలంటీర్లతో వైసీపీ ప్రచారాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 7:02 PM IST
Volunteers For YSRCP Election Campaign in andhra Pradesh : ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా అధికార పార్టీ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు చాలా ప్రాంతాల్లో వాలంటీర్లతోనే (Volunteers) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠంలో వైఎస్సార్సీపీ ఎంపీపీ (MPP) వీరనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు రత్నకుమార్ మేము సిద్ధం అంటూ వాలంటీర్లతో నినాదాలు చేయించడంపై పలువురు ప్రతిపక్ష పార్టీల వారు మండిపడుతున్నారు.
గృహసారథులు, సచివాలయాల కన్వీనర్లతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలని వాలంటీర్లకు వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు సూచించారు. సోమిరెడ్డిపల్లె సహా పలు సచివాలయాల వద్దకు వాలంటీర్లను పిలిపించిన నాయకులు కార్యాలయం వద్దనే సిద్ధం పత్రికలను ప్రదర్శిస్తూ నినాదాలు చేయించారు. వాలంటీర్ల సహాయంతో అధికార పార్టీ ఎన్నికలను (Elections) తప్పుదోవ పట్టించాలని పన్నాగాలు పన్నుతుందన్నారని పలువురు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.