ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సచివాలయంలో ఉరేసుకుని వాలంటీర్​ ఆత్మహత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 1:38 PM IST

Volunteer Suicide in Ananatapur District : అనంతపురంలోని బుడ్డప్ప నగర్​లో లలిత అనే వాలంటీర్ (volunteer) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్ఠానికులు తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న లలిత (30) గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతుందని తెలిపారు. లలిత 36 వ వార్డు వాలంటీరుగా విధులు నిర్వర్తిస్తుండేది. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో ఉండగా సమీపంలోని ఓ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చుట్టుపక్కల వారు తెలిపారు.Volunteer Suicide due to Family Problems : ఉరి వేసుకున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు (Police) సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య (suicide) చేసుకుని ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. లలిత ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details