ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు - ఇద్దరు మహిళలు అరెస్టు - illegal ganja in Visakhapatnam - ILLEGAL GANJA IN VISAKHAPATNAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 2:23 PM IST

Visakhapatnam Police Arrested Two Women were Smuggling Illegal Ganja : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాడేరు నుంచి విశాఖపట్నంకు వస్తున్న ఆర్టీసీ బస్సులో 20 కిలోల గంజాయి, 49 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రత్యేకంగా చెక్‌పోస‌్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. 

ఈ కార్యక్రమంలో భాగంగానే జిల్లాను గంజాయి రహితంగా మార్చాలని నగర పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో ప్రతి రోజు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈరోజు పాడేరు నుంచి విశాఖపట్నంకు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును పెందుర్తిలోని పినగాడి జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అందులో రెండు బ్యాగులలో దాదాపు 20 కేజీల గంజాయి లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను అదులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details