ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పట్టాలు తప్పిన రైలు- తప్పిన ప్రాణనష్టం - Visakha Passenger Train Derailed

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 10:24 AM IST

Visakhapatnam Passenger Train Derailed : విశాఖపట్నం నుంచి భవానిపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొత్తవలస రైల్వే స్టేషన్ దాటగానే సాంకేతిక కారణాలతో రైలు పట్టాలు తప్పడంతో ఇంజను, దాని వెనుకనున్న రెండు బోగీలు ఒక పక్కకు ఒరిగిపోయాయి. లోకో పైలెట్ (Loco Pilot) అప్రమత్తమయ్యి వెంటనే రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ( Passenger) ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.

Visakhapatnam-Bhawanipatna Passenger Special Train Derails at Kottavalasa Station, Passengers Safe : పట్టాలు తప్పిన రైలును రైల్వే అధికారులు మరో ఇంజన్ సాయంతో కొత్తవలస రైల్వే స్టేషన్ ఐదో ప్లాట్ ఫార్మ్ కి తరలించారు. విజయనగరం (Vizianagaram) నుంచి కొత్తవలన మీదుగా విశాఖపట్నం వెళ్లాల్సిన రైళ్లను యథావిధిగా నడిపారు. కొత్తవలస  మీదుగా విజయనగరం వెళ్లాల్సిన రైళ్లను మాత్రం నిలిపివేశారు. ప్రమాదానికి కారణమైన సాంకేతిక సమస్యలు మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details