ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ రైల్వేకు స్థలాన్ని కేటాయించాం : కలెక్టర్‌ మల్లికార్జున - Visakha Railway Zone Lands

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 10:36 AM IST

Visakha Railway Zone Lands Dispute : విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటుకు భూమిని కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని, అయితే ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని రెండు రోజుల క్రితం దిల్లీలోని మీడియా సమావేశంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) చెప్పారు. జోన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయంపై విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున (Collector Mallikarjuna) స్పందించారు. 

దక్షిణ కోస్తా రైల్వేజోన్​కు విశాఖలో అవసరమైన భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొనగా జిల్లా అధికారులు మాత్రం ఇచ్చామనడంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రైల్వేకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.  డిసెంబర్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలో కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చామని అన్నార. సర్వే నెంబర్ 26లో భూమి సిద్ధం చేసి, ఫెన్సింగ్ కూడా వేశామని తెలిపారు. రైల్వే వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం స్థల కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. రైల్వే శాఖ చెప్పిన ప్రకారం 52 ఎకరాలు సమకూర్చామని కలెక్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details