ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో గంజాయి హత్య- ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ - Murder Case Accused Arrested - MURDER CASE ACCUSED ARRESTED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 5:31 PM IST

Young Man Murder Case Accused Arrested: విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన యువకుడు చంద్రకాంత్ హత్య కేసులో 8మంది యువకులను అరకు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీఐ రుద్రశేఖర్ వెల్లడించారు. 

సీఐ తెలిపిన వివరాల ప్రకారం: గత నెల 30వ తేదీన తమ కుమారుడు కనిపించడం లేదని అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లలో విశాఖకు చెందిన చంద్రకాంత్ అనే యువకుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చంద్రకాంత్ మృతదేహాన్ని డుంబ్రిగుడ మండలం బోందుగుడ గ్రామ సమీపంలోని చెరువులో లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం అన్ని కోణాల్లో విచారణ చేపట్టి 8మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యకు గంజాయి వివాదమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు సీఐ రుద్రశేఖర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details