ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ ​- అన్ని పోర్టు​లకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Visakha Cyclone Warning Centre Cyclone Alert to Andhra Pradesh : తూర్పు బంగాళాఖాతంలో రేపు సాయంత్రానికి తుపాన్​ ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24 వ తేదీన పూరి పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో అతి తీవ్ర తుఫాన్ గా తీరం దాటుతుంది. అతి తీవ్ర తుపాన్​ తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్లు బలమైన ఈదురు గాలులు ఉంటాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 25 న ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని పోర్ట్ లకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కెవీ.ఎస్. శ్రీనివాస్​తో ఈటీవీ ప్రతినిధి ఆదిత్య పవన్​ ముఖాముఖి.

బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది నేడు వాయుగుండంగా బలపడింది. బుధవారం నాటికి తుపానుగా, గురువారం నాటికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందొచ్చని ఐఎండీ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details