ETV Bharat / state

"బంగాళాఖాతంలో అల్పపీడనం" - రెండు రోజులు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్‌లో భారీ వర్షం - మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ

Heavy_Rains_in_Hyderabad
Heavy Rains in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Heavy Rains in Hyderabad : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్​లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్ కాలనీ, నిజాంపేటలో వర్షం పడింది. అదే విధంగా కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట, బాచుపల్లిలో మోస్తరు వర్షం కురుస్తోంది. బహదూర్‌పల్లి, గుండ్ల పోచంపల్లి, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాలతో పాటు సూరారం, జీడిమెట్ల, జగద్గిరి గుట్ట, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, పేట్‌బషీరాబాద్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో భారీగా ట్రాఫిక్​ జామ్ ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల నుంచి వచ్చే వాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం హైదారాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.

బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ ​- అన్ని పోర్టు​లకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో తుపాన్​ : తూర్పు - మధ్య బంగాళాఖాతం పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ప్రస్పుటమైన అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా ఏర్పడినట్లు తెలిపారు.

ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడిన తరువాత, ఈ నెల 23వ తేదీన తూర్పు- మధ్య బంగాళాఖాతంలో తుపాన్​గా ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీన ఉదయానికి తీవ్ర తుపాన్​గా ఉద్ధృతి చెంది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాన్ని 24వ తేదీన రాత్రి, 25న ఉదయం పూరీ, సాగర్ ఐలాండ్స్ మధ్య దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణపై కూడా ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వరకు విస్తరించి కొనసాగిన ఆవర్తనం ఇవాళ బలహీనపడిట్లు వెల్లడించారు.

కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.