దుబాయ్‌లో వినాయక చవితి వేడుకలు - భక్తి శ్రద్ధలతో ప్రవాస భారతీయుల పూజలు - VinayakaChavithi celebrations Dubai - VINAYAKACHAVITHI CELEBRATIONS DUBAI
Published : Sep 9, 2024, 1:05 PM IST
VINAYAKACHAVITHI CELEBRATIONS DUBAI : ఉద్యోగ రీత్యా గల్ఫ్ (దుబాయ్) దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండుగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. అందులో భాగంగానే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. దుబాయ్‌లోని జెబల్ అలీ ప్రాంతంలో లాల్ క్యాంప్ దగ్గర ఉన్న 'కంకోడియా కంపనీ'లో పని చేస్తున్న నిజామాబాద్ జిల్లా వాసులు కంపెనీ వారి నుంచి అనుమతి తీసుకుని, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి పాటలు పాడుతూ హిందూ సంప్రాదాయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి రోజు సాయంత్రం భజన చేస్తూ అందరూ కలిసి ఆనందంగా గడుపుతున్నారు. వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని గల్ఫ్ కార్మికులు పేర్కొన్నారు. సొంత గ్రామంలో లేకపోయినా, ఇక్కడ గణనాథుడి పూజించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.