ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యథేచ్చగా అధికారపార్టీ నాయకుల ఇసుక అక్రమ రవాణాలు - లారీలను అడ్డుకున్న గ్రామస్థులు - YCP leaders Irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 1:28 PM IST

illagers Stopped Lorry Carrying Sand Illegally: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. అధికారం అండతో భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఇలాంటివన్నీ వైఎస్సార్సీపీ నేతల అండదండలతోనే జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా సహజ వనరుల్ని చెరబట్టి దొరికినకాడికి తవ్వుకుని వంతులు వేసుకుని వాటాలు పంచుకున్నారు. వారి అరాచకాలపై ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను రైతులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల అండతోనే కొందరు వ్యక్తులు అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న లారీలు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇసుకు గుంతలు లోతుగా తవ్వటం వల్ల లంక భూములకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లంక భూములకు నష్టం వాటిల్లితే జీవనాధారంగా కోల్పోయి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details