అక్రమ తవ్వకాలపై ఆందోళన- మట్టి మాఫియాను అడ్డుకున్న గ్రామస్థులు - Protest Against Illegal Mining
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 12:07 PM IST
Villagers Protest Against Illegal Mining: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో మట్టి అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న యంత్రాలు, లారీలను అడ్డుకుని వారికి సహకరిస్తున్న అధికారులను గ్రామస్థులు నిలదీశారు. అధికారులు సరైన జవాబు ఇవ్వకపోవడంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో సుమారు గంటపాటు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
"వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్ల నుంచి జిల్లాలో అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూడా అక్రమ తవ్వకాలు జరుపుతున్న లారీలను అడ్డుకుని వారికి సహకరిస్తున్న అధికారులను నిలదీస్తే సరైన జవాబు రాలేదు. దీంతో మేమంతా ఆందోళనకు దిగటంతో సీఏ వచ్చి చర్యలు తీసుకుంటామని, ఇకపై అనుమతులివ్వమని చెప్పారు. అంటే ఇన్నాళ్లూ వారి తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందెవరు? దీనివెనుక ఎవరెవరు ఉన్నారు? మొత్తం నిగ్గు తేల్చి అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం" - ఊటుకూరు గ్రామస్థులు