గ్రూప్ డాన్స్ అడ్డుకున్న పోలీసులు- సీఐ, ఎస్ఐపై తిరగబడ్డ గ్రామస్థులు - Villagers Attacked on Police - VILLAGERS ATTACKED ON POLICE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 10:50 AM IST
Villagers Attacked on Police in Nellore : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రూప్ డాన్స్‌లకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు సీఐ వేణు, ఎస్సై ముత్యాలరావు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Argument Between Police and Villagers : గ్రామం మొత్తం ఒకటై పోలీసులపై తిరగబడ్డారు. ఎంత చెప్పినా వినకుండా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు, డాన్సులకు, పలు పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు డీఎస్పీ (DSP) కోటారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి మరీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో రాత్రి జరిగిన ఘటనతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.