విజయవాడలో త్వరలో కెనాల్ బోటింగ్ - కాలువల అభివృద్ధితో దృష్టి పెట్టిన వీఎంసీ - Canals Development in Vijayawada - CANALS DEVELOPMENT IN VIJAYAWADA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 7:41 PM IST
Vijayawada Municipal Commissioner Focus on Canals Development : విజయవాడలో ప్రవహిస్తున్న బందరు, ఏలూరు, రైవస్ కాలువలు పర్యాటకులను ఆకర్షించే విధంగా బోటింగ్ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. కొత్తగా వచ్చిన కమిషనర్ పర్యాటక ప్రాంతాలపై దృష్టి పెట్టారు. నగరంలో పర్యాటక ప్రాంతాలు ఉన్నా పూర్తి స్ధాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు సేద తీరేందుకు అనువైన ప్రదేశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొంటుంది. కెనాల్స్ అభివృద్ధితోపాటు బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని నగరపాలక కమిషనర్ అన్నారు. దీంతో పర్యాటకులతో పాటు స్థానికులనూ ఆకట్టుకునేందుకు నగరపాలక సంస్థ త్వరలో కెనాల్ బోటింగ్‌ను ప్రారంభించనుంది.
ఈ సందర్భంగా కాలువల్లో పర్యటించిన ధ్యానచంద్ర బోటింగ్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు. ఈ కాలువల్లో ఎటువంటి చెత్త, గృహ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, వ్యర్థాలు వేసిన వారికి జరిమానా విధించాలన్నారు. కాలువల్లోకి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆయన ఆదేశించారు.