అతి అరుదైన శస్త్ర చికిత్స- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో విజయవాడ వైద్యుడికి స్థానం - Vijayawada Doctor Enters Limca - VIJAYAWADA DOCTOR ENTERS LIMCA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2024, 7:08 PM IST
Vijayawada Doctor Enters Limca book of Records: విజయవాడ వైద్యుడికి 2024 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. కాలిలోని అతి పొడవైన రక్తపు గడ్డను తొలగించేందుకప అరుదైన శస్త్ర చికిత్స చేసినందుకు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సాయిపవన్ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. 63 ఏళ్ల వృద్ధుడి ఎడమ కాలిలోని 20 సెంటీమీటర్ల అతి పొడవైన రక్తపు గడ్డను శస్త్రచికిత్స చేసి సురక్షితంగా తొలగించారు.
గుండెజబ్బుతో బాధపడుతున్న ఆ వృద్ధుడు ఇటీవల విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి వచ్చాడు. అతడి ఎడమకాలిలో రక్తప్రసరన ఆగిపోయి గడ్డ కట్టడాన్ని వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి పొడవైన రక్తపు గడ్డును సురక్షితంగా తొలగించారు. ఈ నేపథ్యంలో అరుదైన శస్త్ర చికిత్స చేసినందుకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిషన్‌లో విజయవాడ వైద్యుడు స్థానం పొందారు. లిమ్కా రికార్డ్‌లో స్థానం సంపాదించిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సాయిపవన్తో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి మీకోసం.