ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సింగపూర్​ తరహాలో విశాఖలో హోటల్ - ఇక 'గేట్ వే' మూసివేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 12:56 PM IST

Varun Group to Build a Hotel With Modern Facilities in Visakhapatnam : విశాఖపట్నంలో రూ.500 కోట్లతో వరుణ్ గ్రూప్ అత్యాధునిక వసతులతో హోటల్ నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న "ది గేట్ వే" హోటల్‌ని తొలగించి ఆ స్థానంలో మూడు భారీ టవర్లు నిర్మించనున్నట్లు వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభుకిశోర్ వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగదారుల అభిరుచి తగ్గట్లు కొత్త హోటల్ నిర్మిస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతున్న వేళ సింగపూర్ లోని "మెరైన్ బే సాండ్స్" తరహాలో నిర్మాణాలు చేపడతామన్నారు. మూడున్నరేళ్లలో నిర్మాణాల్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఎండీ వరుణ్ దేవ్, J.M.D వర్ష, ఆర్కిటెక్ట్ కఠిర పాల్గొన్నారు

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేటితో ది గేట్ వే హోటల్ ని మూసివేసి నిర్మాణపనులు ఆరంభిస్తామని వెల్లడించారు. ఈ హోటల్ తో పలువురికి చాలా ఆత్మీయ బంధాలు ఉన్నాయని, 1988 లో సీపెర్ల్ హోటల్​గా ఉన్న ఈ భవనాలు, 1992లో తాజ్ రెసిడెన్సీగా వ్యవహరించేవారని, 2018 లో వరుణ్ గ్రూప్ తీసుకుని గేట్ వే హోటల్​గా నడుస్తోందని ఆ గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్ చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details