ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా వంగవీటి రాధ - Vangaveeti Radha in TDP Rally - VANGAVEETI RADHA IN TDP RALLY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 4:29 PM IST
Vangaveeti Radha in TDP Rally Chitoor District : చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మద్దతుగా వంగవీటి రాధ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలోని మురుకంబట్టు వీధిలో వంగవీటి రాధకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికాయి. మురుకంబట్టు నుంచి ఎమ్మెస్సార్ కూడలి మీదుగా ర్యాలీగా వెళ్లి దర్గా సర్కిల్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్టేట్‌లోని ఆర్ఎస్ కళ్యాణమండపం వరకు భారీ కార్ల ర్యాలీ చేశారు. ర్యాలీ అనంతరం బలిజ కులస్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిత్తూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అఖండ విజయం విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి సుపరిపాలనను కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వంగవీటి రాధా మాట్లాడుతూ చిత్తూరు నియోజక వర్గ కూటమి అభ్యర్ధి గురజాల బలిజ కులస్థుల మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.