జనాన్ని మోసం చేసిన జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి : వంగవీటి - Vangaveeti Radha ELECTION CAMPAIGN - VANGAVEETI RADHA ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 12:56 PM IST
Vangaveeti Radha In Kapu Youth Meeting in Bapatla District : సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసిన జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత వంగవీటి రాధ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్థి కొండయ్యకు మద్ధతుగా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కొత్తపేటలో నిర్వహించిన కాపు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు వంగవీటి రాధ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశానికి టీడీపీ అభ్యర్ది కొండయ్య కుమారులు గౌరి అమర్నాధ్, మహేంద్రనాథ్ హాజరయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు రాధాకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా రాధ మాట్లాడుతూ కూటమి అభ్యర్దులను గెలిపించుకొవాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి కొండయ్యను గెలిపించాలని చీరాల ప్రజలకు పిలుపునిచ్చారు. కాపుల సంక్షేమం అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని మే13 న జరిగే ఎన్నికలలో వైఎస్సార్సీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అన్నారు.