ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం జగన్​ నిరుద్యోగులను మోసం చేశారు : టీఎన్​ఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్​ గోపాల్​ - visakha district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 7:55 PM IST

Unemployed protest under TNSF against Mega DSC in Visakha : త్వరలో ప్రభుత్వం దద్దరిల్లే విధంగా నిరుద్యోగులందరూ ఏకమై సీఎం క్యాంప్​ కార్యాలయాన్ని ముట్టడిస్తామని విశాఖలో టీఎన్​ఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వీ ప్రణవ్​ గోపాల్​ వెల్లడించారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అంటూ సీఎం జగన్​ మోహన్​ రెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 23 వేలకు పైగా టీచర్​ పోస్టులు ఉంటే 6 వేల పోస్టులకే నోటిషికేషన్​ ఇవ్వటం దారుణమన్నారు. పాదయాత్ర సమయంలో మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు.

ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వ కల్లబొల్లి మాటలు నమ్మేందుకు నిరుద్యోగులు సిద్ధంగా లేరని ప్రణవ్ గోపాల్​ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమ పోరాటాలను ప్రభుత్వం పోలీసుల అండతో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details