ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కల్లూరులో వైభవంగా ఉగాది ఉత్సవాలు - గాడిదలు, ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు - Ugadi Celebrate Chowdeshwari Temple - UGADI CELEBRATE CHOWDESHWARI TEMPLE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 12:31 PM IST

Ugadi Celebrated in Sri Chowdeshwari Devi Temple in Kalluru : కర్నూలు జిల్లా కల్లూరులో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. ఉగాది సందర్భంగా చౌడేశ్వరి మాత దేవాలయం చుట్టూ బురదలో గాడిదలు, ఎద్దుల బండ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించడం ఆచారంగా వస్తుందని గ్రామస్థులు తెలిపారు. గాడిదలను రజకులు వారి ఇంటి నుంచి ఊరేగింపుగా గుడి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ బురదలో ప్రదక్షిణలు చేయించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు.

Giddanjaneya Swamy Temple in Venkatagiri: మండలంలోని వెంకటగిరి గ్రామంలో గిద్దాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని విష్ణుమూర్తి, భూదేవి, శ్రీదేవి, గిద్దాంజనేయస్వామిని ఉత్సవమూర్తులుగా పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభపై దేవతామూర్తులను కొలువుదీర్చి హారతులు ఇచ్చారు. ప్రభోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు.  

ABOUT THE AUTHOR

...view details