ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE టీవీ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో రామోజీరావు సంతాప సభ- ప్రత్యక్ష ప్రసారం - Ramoji Rao condolence meeting - RAMOJI RAO CONDOLENCE MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 6:26 PM IST

Updated : Jun 9, 2024, 6:56 PM IST

TV Artists Ramoji Rao condolence Meeting : ఈ ఉషా కిరణాలు అంటూ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ఆ గీతాన్ని వినని తెలుగువాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఉషా కిరణ్‌ మూవీస్‌ బ్యానర్ ద్వారా ఎంతోమంది నటులు, దర్శకులు, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అంతేకాదు మయూరి ఫిలిం డిస్టిబ్యూటర్స్​ను ప్రారంభించి కొన్ని వందల తెలుగు చిత్రాలనే కాకుండా, ఇతర భాషా చిత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దేశంలోని అన్ని భాషా చిత్రాలను షూట్ చేస్తుంటారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్న తేడా లేకుండా అందరూ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి షూట్ చేసుకుని వెళ్తుంటారు. సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవ చేశారు. ఆ మహానీయుడు మరణం సినీ లోకానికి తీరని లోటు. అందువల్ల చిత్ర పరిశ్రమ దర్శకులు, నిర్మాతలు ఆయన మరణానికి సంతాపంగా ఇవాళ షూటింగ్​ను నిలిపివేశారు. హైదరాబాద్​లోని ప్రసాద ల్యాబ్​లో సంతాప సభను ఏర్పాటు చేసి టెలివిజన్​ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.  
Last Updated : Jun 9, 2024, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details