ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పెరుగుతున్న విష జ్వరాలతో అల్లాడుతోన్న ప్రజానికం- ఆ ఇంజక్షన్లు తీసుకోవద్దంటున్న వైద్యులు - toxic fevers in Guntur district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 7:51 PM IST

Toxic Fever Patients Increasing Day by Day in Guntur District : కలుషిత నీరు తాగి విషజ్వరాల బారినపడుతున్న రోగుల సంఖ్య గుంటూరు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుంది. జిల్లాలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వారం రోజులుగా జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపుతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటిలోనూ ఇద్దరు, ముగ్గురు బాధితులు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులు తీసుకుని తెనాలి, గుంటూరు, మంగళగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుంటున్నామని వృద్ధులు వాపోతున్నారు. గ్రామంలో తాగునీరు కలుషితమవ్వడం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామస్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. అందరికీ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే తాగునీరు, రక్త నమూనాలు సేకరించామని వైద్యులు చెబుతున్నారు. ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జ్వరం వచ్చిన వారంతా నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఖరీదైనా స్టెరాయిడ్ ఇంజక్షన్​లు వాడుతున్నారని అందుకే కీళ్ల ప్రాంతంలో వాపులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details