అంబటి రాంబాబు ఇంటి ముందు టిఎన్ఎస్ఎఫ్ నేతల ఆందోళన - TNSF comments on Ambati Rambabu - TNSF COMMENTS ON AMBATI RAMBABU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 3:18 PM IST
TNSF comments on Ambati Rambabu: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చీర, గాజులు, పూలు సమర్పించి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆహ్వానం పలికారు. గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి ర్యాలీగా వెళ్లిన టిఎన్ఎస్ఎఫ్ నేతలు చీర గాజులు పూలు అంబటి రాంబాబు ఫోటోకి అలంకరించి ఆహ్వానం పలికారు. అసెంబ్లీ వేదికగా అమ్మలాంటి భువనేశ్వరిని అనేక మాటలు మాట్లాడారని టిఎన్ఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశి మండిపడ్డారు. ఇకపై మా పార్టీ నాయకులపై ఎటువంటి వ్యాఖ్యలు చేసిన అంతే వేగంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాంబాబు గుంటూరు జిల్లాలో ఎక్కడ అడుగుపెట్టే పరిస్థితిలో లేరని విమర్శించారు. గంట, అరగంట నేతల వల్లే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓటిమి పాలైందని విమర్శించారు. ఇకపై టీడీపీ నేతలపై అనవసర ఆరోపణలు చేస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇకనైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ నేతలు హితవు పలికారు.