ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

భూమన కరుణాకర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: ఆరణి శ్రీనివాసులు - arani srinivasulu fires on ysrcp - ARANI SRINIVASULU FIRES ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 5:12 PM IST

Arani Srinivasulu Fires on YSRCP Leaders: తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిలకు ఓటమి భయం పట్టుకోవడంతో కూటమి నేతలపై బెదిరింపులకు దిగుతున్నారని జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయడాన్ని ఖండించారు. బాలసుబ్రమణ్యం ఇంటిపై దాడులు వెనుక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల హస్తం ఉందని ఆరోపించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తుండటంతోనే భయపడే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తనిఖీలు చేశారని మండిపడ్డారు. ఈ చర్యలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. రేణిగుంట గోడౌన్​లలో దొరికిన వైసీపీ ఎన్నికల ప్రచార సామగ్రిని సీజ్ చేయడంలో అధికారుల వైఖరి దారుణమన్నారు. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారన్నారు. విధులు మరిచి ప్రవర్తించిన అధికారులు ఇప్పటికే కొంతమంది సస్పెండ్ అయ్యారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొంతమంది పోలీసుల తీరు మారలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details