ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం - భయాందోళనలో స్థానికులు - Tiger Attack on Cow
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 10:28 PM IST
Tiger Attack on Cow in Prakasam District : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్ల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా తమ గ్రామం సమీపంలోని కొండల ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నిన్న(సోమవారం) రెండు ఆవులపై పెద్దపులి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒక ఆవు మృతి చెందగా మరో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Cow Died on Tiger Attack : అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పెద్దపులి కాళ్ల ముద్రలు సేకరించారు. పులి దాడి చేసిన ఘటన వాస్తమేనని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం ఆవుపై పులి దాడికి సంభందించిన ఫొటోలు కూడా విడుదల చేశారు. స్థానికులు, రైతులు పొలాలకు వెళ్లినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామ సమీపంలో పులి సంచరిస్తుందని తెలిసి గ్రామ ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.