ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలుగు గంగ జలాశయంలో ముగ్గురు యువకులు మృతి- మృతదేహాలను వెలికితీసిన గజఈతగాళ్లు - THREE died IN TELUGU GANGA project - THREE DIED IN TELUGU GANGA PROJECT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 12:54 PM IST

Updated : Jul 29, 2024, 5:02 PM IST

Three People Missing in Telugu Ganga Reservoir in YSR District : వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లెలోని తెలుగుగంగలో గల్లంతైన ముగ్గురు యువకుల మృత దేహాలు దొరికాయి. రహంతుల్లా, షాహిద్, ముదాఫీర్ మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన వీరు ఆదివారం ఇంట్లో చెప్పి తెలుగుగంగ జలాశయం వద్దకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జలాశయం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ యువకులకు సంబంధించిన దుస్తులు, చెప్పులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి వీరి మృతదేహాలను బయటకు తీశారు.

ఇటీవల భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాపట్ల జిల్లాలోని రామాపురం బీచ్‌లో గతంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. సముద్ర స్నానానికి దిగి అలల ఉద్ధృతికి వారు కొట్టుకుపోవడం తెలిసిందే. 

Last Updated : Jul 29, 2024, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details