ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సు డ్రైవర్​పై దాడి చేసి ఫోన్‌ లాక్కెళ్లిన దుండగులు - Three Men Attacked on RTC Driver - THREE MEN ATTACKED ON RTC DRIVER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 4:27 PM IST

Three Men Attacked on RTC Driver And Stole His Phone : ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను కొట్టి ఫోన్‌ లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. కొవ్వూరు డిపోకు చెందిన బస్సు జంగారెడ్డిగూడెం వెళ్తుండగా శివారు ప్రాంతంలో మరమ్మతులకు గురై ఆగిపోయింది. డ్రైవర్ పోలుమాటి బాబు డిపో సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని బస్సుకు మరమ్మతులు చేస్తుండగా చీకటి పడింది.  డ్రైవర్ తన ఫోన్లో టార్చ్ వేసి మెకానిక్​కు చూపుతుండున్నాడు. అతడు రిపేర్‌ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు అక్కడకు వచ్చారు. 

డ్రైవర్‌ బాబు వద్ద నుంచి ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశారు. డ్రైవర్​ ప్రతిఘటించడంతో ఓ యువకుడు పక్కనే ఉన్న రాయితో తలపై కొట్టాడు. తోటి సిబ్బంది తేరుకుని యువకులను పట్టుకునేలోపు ఫోన్ లాక్కుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు. డ్రైవర్​ పై జరిగిన ఘటనపై స్పందించి పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details