తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌పై ఐజీకి ఫిర్యాదు చేసిన బాధితుడు - TENALI EX MLA VICTIM COMPLAINT - TENALI EX MLA VICTIM COMPLAINT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 5:48 PM IST
TENALI EX MLA VICTIM COMPLAINT TO IG: పోలింగ్ రోజున తనపై దాడి చేసిన తెనాలి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్, అతని అనుచరులపై కఠిన సెక్షన్లు పెట్టాలని బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ గుంటూరు ఐజీకి ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రం వద్ద వరసలో సుధాకర్ నిలబడి ఉన్నారు. ఆ సమయంలో శివకుమార్ తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లడాన్ని సుధాకర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆగ్రహానికి గురై, సుధాకర్‌పై చెయ్యి చేసుకోగా, బాధితుడు సైతం తిరిగి కొట్టడం చర్చనీయాంశమైంది.
ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు సుధాకర్ మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, మరి కొందరిపైన చర్యలు తీసుకోవాలని తెనాలి పోలీసులను కలిసినా ప్రయోజనం లేదని సుధాకర్ ఆరోపించారు. అందుకే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీని కోరినట్లు సుధాకర్ వెల్లడించారు.