గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : శ్రీధర్ బాబు - Godavari situation field level - GODAVARI SITUATION FIELD LEVEL
Published : Sep 4, 2024, 1:20 PM IST
Sridhar Babu Visited Flood Affected Areas in Manthani : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో గోదావరి నదీ ప్రవాహన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. రాబోయే రెండ్రోజులు భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు.
గోదావరి నదిలోకి వచ్చే ఇన్ఫ్లో, ఔట్ఫ్లోను నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదావరి వెనక జలాల వల్ల మునిగే గ్రామాల పట్ల సంబంధిత అధికారులందరూ ముందస్తు చర్యలు చేపట్టే ప్రక్రియలో నిమగ్నమయ్యారని తెలిపారు. వరదల వల్ల రాబోయే విపత్తును అందరి సహకారంతో ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామన్నారు.