తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్​ - ప్రత్యక్షప్రసారం - TS GRADUATE MLC BY POLL LIVE - TS GRADUATE MLC BY POLL LIVE

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 11:04 AM IST

Updated : May 27, 2024, 11:11 AM IST

Graduate MLC By Election Polling 2024  LIVE : వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.  పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే జరుగుతుండటంతో ప్రజలందరి దృష్టి ఈ ఎన్నిక పైనే ఉండనుంది. ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రచారంలో ఎత్తులు, పైఎత్తులు, వ్యూహ, ప్రతివ్యూహాలను ప్రదర్శించాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న మూడు పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో నిలిచారు.
Last Updated : May 27, 2024, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details