LIVE : బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ - CM Revanth Launch BFSI Course Live - CM REVANTH LAUNCH BFSI COURSE LIVE
Published : Sep 25, 2024, 1:34 PM IST
|Updated : Sep 25, 2024, 2:36 PM IST
CM Revanth Launches BFSI Courses Live : ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఏటికేడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అదేస్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం నైపుణ్యాల లేమి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసులు, ఇన్సురెన్స్ రంగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది. ఈ సమస్య అధిగమించేందుకు మైనర్ డిగ్రీలను అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 కళాశాలల్లో బ్యాకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్‌లో నైపుణ్య శిక్షణ అందించే కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 18 ఇంజినీరింగ్ మరో 20 డిగ్రీ కళాశాలలను ఎంపిక చేశారు. ఐదు వేల మంది బీటెక్, మరో 5వేల మంది డిగ్రీ విద్యార్థులకు ఈ కోర్సులు నేర్పించనున్నారు. బీటెక్ సెకండ్ , థర్డ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి ఇందులో శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్టీయూ ఫైన్‌ఆర్ట్స్ కాలేజీలో ఈ కోర్సులను ప్రారంభించారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.
Last Updated : Sep 25, 2024, 2:36 PM IST