LIVE : శాసనసభ ప్రత్యేక సమావేశం - ప్రత్యక్షప్రసారం - TELANGANA ASSEMBLY SPECIAL SESSION
Published : Dec 30, 2024, 10:11 AM IST
|Updated : Dec 30, 2024, 1:57 PM IST
Telangana Assembly Special Session Due To Manmohan Singh Death : తెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ శాసనసభలో భారత మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాప ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తారు. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరిశీలించారు. అదే విధంగా సమావేశం సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులకు సభాపతి ప్రసాద్ కుమార్ సూచించారు.
Last Updated : Dec 30, 2024, 1:57 PM IST