పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం - 50 రోజులు ఓపిక పట్టండి: వర్ల రామయ్య - Varla Ramaiah on Police Problems - VARLA RAMAIAH ON POLICE PROBLEMS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 3:17 PM IST
Varla Ramaiah React on Police Problems : సీఎం వైఎస్ జగన్ కోసం పని చేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటకట్టకుందని, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీసుల ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్స్, టీఏ, డీఏలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. శంకరావు చావుకు జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పోలీసుల సమస్యలపై మాట్లాడాల్సిన, పోలీసుల అసోసియేట్ ప్రెసిడెంట్ జనకం శ్రీనివాసరావు చేతులెత్తేశాడని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు టీఏ, డీఏలను విడదుల చేస్తామని వర్ల హామీ ఇచ్చారు. పోలీసులకు వెంటనే టీఏ, డీఏలను విడదుల చేస్తామంటే తాము సహకరిస్తామని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆత్మహత్య సమాధానం కాదని, ఆత్మహత్య చేసుకోవద్దని వర్ల రామయ్య పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబుతో మాట్లాడి డీఏ ఇతర ప్రయోజనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతల మీద ఉన్న కేసులు నిజమైతే, వారికి శ్రీకృష్ణుడి జన్మస్థానమే అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పోలీసులను అడుగడుగునా మోసం చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్స్ కు కోట్లకు కోట్లు బిల్లులు చెల్లించే ప్రభుత్వం, పోలీసులకు రావాల్సిన, డీఏ, సరెండర్ లీవ్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. ఈరోజు డీజీని కలిసి పోలీస్ సమస్యలపై మాట్లాడుతానని వర్ల తెలిపారు.