Live: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - TDP Ugadi Celebrations Live - TDP UGADI CELEBRATIONS LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 12:18 PM IST
|Updated : Apr 9, 2024, 1:27 PM IST
TDP Ugadi Celebrations Live: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉగాదిని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నామని, క్రోధి అంటే కోపంతో ఉన్నవారు, మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందాంమన్నారు. ఈ ఉగాది, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశ, విదేశాల్లోని తెలుగువారికి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కలగాలని పేర్కొన్నారు. తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా శూభాకాంక్షలు తెలిపారు. నవవసంతం అందరికీ ఆయురారోగ్యాలు, సకల శుభాలు చేకూర్చాలని అభిలాశించారు. ఉగాది తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగతికి, ప్రజాసంక్షేమానికి పాటుపడదామంటూ పిలుపునిచ్చారు.
Last Updated : Apr 9, 2024, 1:27 PM IST