అధికారంలోకి వచ్చాక గులకరాయి డ్రామాపై సీబీఐ విచారణ చేయిస్తాం: పట్టాభి - TDP Spokesperson Pattabhi Comments - TDP SPOKESPERSON PATTABHI COMMENTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 2:04 PM IST
TDP Spokesperson Pattabhi Comments on Stone Attack on Jagan : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గులకరాయి డ్రామాపై సీబీఐ విచారణ చేయిస్తామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. నిన్నటి వరకు ఆధారాలే లేవన్న పోలీసులకు తెల్లారే సరికి నిందితులు ఎలా దొరికారని అనుమానం వ్యక్తం చేశారు.
Stone Attack on CM Jagan : అసలు రాయే దొరకలేదు, అగంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2లక్షల బహుమానం ఇస్తామని సోమవారం ప్రకటించారు. మంగళవారానికి రాయి వేసిన వ్యక్తి దొరికారని అంటున్నారు. జగన్కు తొత్తులుగా కొందరు అధికారులు గులకరాయి నాటకాన్ని రక్తి కట్టించాలని చూస్తున్నారని పట్టాభి ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డ్రామాపై ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక సీబీఐతో విచారణ జరిపిస్తాం. ఆ రోజు ఈ పథక రచనలో భాగస్వాములైన వాళ్లు ముద్దాయిలుగా బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి హెచ్చరించారు.