ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కుటుంబ సమేతంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నారా లోకేశ్ - శ్రీశైల ఆలయంలో లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 3:33 PM IST

TDP Nara Lokesh Visit Srisailam Temple: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన లోకేశ్​కు మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, అఖిలప్రియ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మహా ద్వారం వద్ద నారా లోకేశ్​, బ్రాహ్మణి, దేవాన్ష్​లకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

లోకేశ్​ దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో లోకేశ్​ దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. దర్శనం అనంతరం నారా లోకేశ్ కుటుంబం హైదరాబాద్ బయలుదేరింది. అంతకుముందు నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details