ఇంటింటి ప్రచారానికి అనుమతులపై ఈసీకి కనకమేడల లేఖ - TDP MP Kanakamedala Ravindra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 11:40 AM IST
TDP MP Kanakamedala Ravindra: నిబంధనలకు విరుద్దంగా, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై ఎంపి కనకమేడల రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ పై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
నిబంధనలకు విరుద్దంగా, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతిపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేని కనకమేడల లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అభ్యంతరాలు తెలిపిన, దూషించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ప్రతి రోజూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రచారం కోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఎన్నడూ ఇవ్వలేదన్న విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. డోర్ టు డోర్ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.