ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'భద్రత విషయంలోనూ అధికార దుర్వినియోగమే' - ఈసీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 12:39 PM IST

TDP MLC Bhumireddy Complaint to Election Commission : ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే విషయంలో  ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఈసీకి (Election Commission) ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో   ప్రతిపక్ష పార్టీల వారికి  భద్రత లేదన్న భూమిరెడ్డి దీన్ని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎవరికి భద్రత కల్పించాలన్న దానిపై భద్రతా సమీక్ష కమిటీ సమావేశమై నిర్ణయాలు చేయడం ఆనవాయితీ అని తెలిపారు

అధికార పార్టీ వారికి 2+2 నుంచి 4+4 వరకు గన్మెన్లను కేటాయిస్తూ, ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చారని ఆయన విమర్శించారు. ఇది ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇక్కడ కూడా అధికారపార్టీ వారు ఎవరికి చెబితే వారికే గన్మెన్లను ఇస్తున్నారని విమర్శించారు. స్థానిక చోటామోటా నాయకులకు గన్మెన్లను ఇచ్చారని ఆక్షేపించారు. జరుగుతున్న అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. రక్షణ కల్పించే విషయంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పారదర్శకంగా వ్యవహరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్లను ఉపసంహరించే విధంగా చూడాలని భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి డిమాండ్‌ (Demond) చేశారు.
 

ABOUT THE AUTHOR

...view details