పంటలకు కృష్ణా జలాలను తరలించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలం: పయ్యావుల కేశవ్ - Payyavula Keshav campaign Anantapur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 1:44 PM IST
TDP MLA Payyavula Keshav Fire on YSRCP Govt in Anantapur District : పంటలకు హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను తరలించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లులో ' బాబు ష్యూరిటీ భవిష్యత్తు - గ్యారెంటీ ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు.
వేల ఎకరాల్లో మిరప పంట దెబ్బతింటుందని తెలిసినా కృష్ణా జలాలను తరలించడానికి వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయలేదని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో కృష్ణా జలాలను తరలించి పంటలను కాపాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలను అధికారంలోకి రాగానే తక్షణం అమలు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, చంద్రబాబును సీఎంగా గెలిపించాలని ఓటర్లును కోరుకున్నారు.