ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎరుపు రంగు అంటే జగన్ భయపడుతున్నాడు- కలలో కూడా రెడ్ బుక్ కలవరిస్తున్నాడు : టీడీపీ - TDP LEADERS FIRE ON JAGAN - TDP LEADERS FIRE ON JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 11:25 AM IST

TDP Ministers And MLAs Comments on YS Jagan : నంద్యాల జిల్లా సీతారామపురంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. హత్య కేసుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును, లోకేశ్​ను బాధ్యులుగా చేయాలనడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా జగన్ మాయ మాటలు ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 

రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను వ్యక్తి గత స్వార్ధం కోసం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. వినుకొండ ఘటనలో అసత్యాలు ప్రచారం చేయటంలో విఫలమై భంగపడిన రీతిలోనే ఇవాళ నంద్యాలోనూ జగన్ బోల్తా పడ్డారని పేర్కొన్నారు. నంద్యాల హత్య ద్వారా జగన్​ మరో డ్రామాకు తెరతీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు జగన్‌ మారుపేరని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ పాలన 144 సెక్షన్‌ పాలన అని విమర్శించారు. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా జగన్‌కు రెడ్‌బుక్‌ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details